మేడ్చల్ జిల్లా పోచారం పురపాలిక సంఘం పరిధిలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఛైర్మన్ బోయపల్లి కొండల్‌రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు రూ. కోటితో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 50 ఏళ్ల నుంచి పరిష్కారంకాని సమస్యలను వార్డుల్లో గుర్తించి పరిష్కరించేందుకు పట్టణ ప్రగతిని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని పుర అధ్యక్షులు, కౌన్సిలర్లు తమ వార్డులను, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. తమ ఇంటితో పాటు వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. గతంలో ఇంటింటికి చెత్తబుట్టలను పంపిణీ చేసినా వాటిని ప్రజలు ఉపయోగించడం లేదని.. ఇక నుంచి తడి, పొడి చెత్తలను వేరు చేసి రిక్షాలో వేయాలన్నారు.
ఇదీ చూడండి : 'ఆలయాల పేరుతో అక్రమాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?'