మేడ్చల్ జిల్లాలోని షాపూర్‌నగర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ రాజుతో కలిసి ప్రారంభించారు. దేశంలో అందుబాటులోకి వచ్చిన మొదటి రెండు వ్యాక్సిన్లలో ఒకటి మేడ్చల్‌లోని భారత్ బయోటెక్ నుంచి రావడం గర్వకారణమని పేర్కొన్నారు. టీకా వేసుకున్న వారిని 30 నిమిషాల పాటు పరిశీలించమని వైద్య సిబ్బందికి సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో 2,686 మంది వైద్య సిబ్బందికి మొదటగా టీకా అందించనున్నట్లు డీఎంహెచ్ఓ మల్లికార్జున్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురైతే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించనున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చారిత్రక ఘట్టం: టీకా పంపిణీకి మోదీ శ్రీకారం