రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ సద్వినియోగం అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటి పరిధిలో రూ. 2కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ ముల్లి పావనితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు.. అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని మల్లారెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో హుస్సేన్ సాగర్