దేశంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ ప్రథమ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ నిర్మాణానికి మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో 56 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. దానికి ప్రహరీ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి. జగదీశ్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, తదితరులతో కలిసి భూమి పూజ నిర్వహించారు గతంలో పోలీస్ అంటే భయం ఉండేదని... ఇప్పుడు అలాంటి భయం తొలగిపోయిందన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ భవనాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. పోలీసు శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నేరాల నియంత్రణలో రాచకొండ పోలీసులు బాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మరో అంతర్జాతీయ వేడుకకు వేదికగా భాగ్యనగరం