విడతల వారీగా జిల్లా ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందజేస్తామని మేడ్చల్ కలెక్టర్ శ్వేతామహంతి హామీ ఇచ్చారు. శుక్రవారం నాడు మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె సందర్శించారు. ఆయా కేంద్రాల్లో జరుగుతోన్న వ్యాక్సిన్ పంపిణీ తీరును పరిశీలించారు.
ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని పీహెచ్‌సీలతో పాటు అర్బన్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారంతా.. తమకు దగ్గరలో ఉన్న కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. రెండో డోసు వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిందిగా.. వైద్యాధికారులు, సిబ్బందిని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. మల్లికార్జున్‌రావు, తహసీల్దార్ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా అంతం కోసం 'దెయ్యాల నృత్యం'