ETV Bharat / state

హైదరాబాద్​లో జరిగిన మాతాజీ నిర్మల దేవి శతజయంతి ఉత్సవాలు.. - Mataji Nirmala Devi Sahaja Yoga Trust

Mataji Nirmala Devi Sahaja Yoga Trust: మాతాజీ నిర్మల దేవి శతజయంతి ఉత్సవాలలో భాగంగా కేపీహెచ్​బీ కాలనీలోని రమ్య గ్రౌండ్​లో సహజ యోగ జ్ఞాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధ్యానం అసలు ఎలా చేయాలని.. మాతాజీ నిర్మల దేవి సహజ యోగ ట్రస్ట్​ సభ్యులు వివరించారు.

yoga
యోగా ట్రస్ట్​
author img

By

Published : Mar 5, 2023, 4:11 PM IST

హైదరాబాద్​లో ఘనంగా జరిగిన మాతాజీ నిర్మల దేవి శతజయంతి ఉత్సవాలు

Mataji Nirmala Devi Centenary Celebrations: మన చిత్తమును ఆత్మవైపు మళ్లించడమే అసలైన ధ్యాన యోగమని.. సహజ యోగా ధ్యాన పరిచయ వేదిక కార్యక్రమంలో మాతాజీ నిర్మల దేవి సహజ యోగ ట్రస్ట్ నిర్వాహకులు వివరించారు. మాతాజీ నిర్మల దేవి శతజయంతి ఉత్సవాలలో భాగంగా కేపీహెచ్​బీ కాలనీలోని రమ్య గ్రౌండ్​లో సహజ యోగ జ్ఞాన పరిచయ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మాతాజీ నిర్మలాదేవి చిత్రపటాన్ని ఊరేగింపుగా రమ్య మైదానానికి తీసుకొచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన పరిచయ వేదిక కార్యక్రమంలో కచేరీనీ ఏర్పాటు చేసి.. సంగీతం రూపంలో పలు విషయాలను బోధించారు. మనిషి ఈర్ష, ద్వేషము, లోభము, కోపము, అహం తదితర విషయాలతో నిత్యం పోరాడుతూ.. ప్రశాంతతకు దూరమవుతున్నాడని నాటక రూపంలో తెలియ చెప్పారు. ప్రతి మనిషి జీవితంలో ప్రశాంతత లేకుండా రోజువారి జీవితంలో పరిగెత్తుతూ ప్రశాంతతను కోల్పోతున్నాడని వివరించారు. మనిషి తన ఆత్మను, శరీరాన్ని నియంత్రించుకోవడమే సహజ యోగలో భాగమని సూచించారు. కార్యక్రమంలో మాతాజీ నిర్మల దేవి సహజ యోగ ట్రస్ట్ సభ్యులు, స్థానికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.