తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్‌రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డికి మంత్రులు, అసదుద్దీన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జననేతగా ఎదిగిన మర్రి.. మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. అన్నివేళలా తాము వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: Highcourt: దేవరయాంజల్ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి?