బంగారు తెలంగాణ సాకారనికి సీఎం కేసీఆర్ అలుపెరుగని ప్రయత్నం చేస్తున్నారని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ మెప్మాలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ రిసోర్స్ పర్సన్ సంఘం వారు ఆయన నివాసంలో కలిశారు. శాలువాతో సన్మానించి.. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అలుపెరుగని ప్రయత్నం
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ సాకారం చేసేందుకు అలుపెరుగని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతు బంధు పథకం యావత్ దేశానికే ఆదర్శమని కొనియాడిన ఆయన. అన్ని వర్గాల ప్రజా సక్షేమమే లక్ష్యంగా పథకాల రూపకల్పన చేశారని పునరుద్ఘాటించారు.
కృషి చేస్తాను
తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కార్మిక విభాగ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, కార్మిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రైతులతో అసంపూర్తిగానే ముగిసిన చర్చలు- 15న మరోసారి!