మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ బస్తీ దవాఖానను ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి పేదలకు మెరుగైన సేవలు అందిస్తామని రామ్మోహన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానాను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే మహానగరంలో 123 బస్తీ దవాఖానాలు ఉండగా... మరో 45 ఆస్పత్రులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు నేడు శ్రీకారం చుట్టారు.
ఇవీ చూడండి: రెండున్నర గంటల్లో 4లక్షల టికెట్ల బుకింగ్స్