ETV Bharat / state

'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం - ధరణిలో స్లాట్ బుకింగ్ విధానం

how to do slot booking in dharani portal
'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం
author img

By

Published : Oct 29, 2020, 1:16 PM IST

Updated : Oct 29, 2020, 7:38 PM IST

13:10 October 29

'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

'ధరణి'లో స్లాట్​ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం

ధరణి పోర్టల్‌లో  ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి..? అది తెరవడం ఎలా..? ముందస్తుగా ఎలాంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలి..? ఇలాంటివి ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఆన్‌లైన్‌లో ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించాలి ..? ఈ విషయాలపై అవగాహన కోసం ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

ఇలా చేసుకోవాలి..

వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లన్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేలా ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను రూపొందించింది. రిజిస్ట్రేషన్‌, పార్టిషన్‌ చేసుకోవాలనుకునేవారు ముందుగా ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఇందుకోసం పోర్టల్‌ లోకి వెళ్లగానే వ్యవసాయ ఆస్తులు, వ్యవసాయతేర ఆస్తులు అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ఒకటి ఎంపిక చేసుకొని ఫోన్‌ నంబరు, పాస్‌వర్డ్‌ నమోదు చేసుకున్నాక... జనరేట్‌ ఓటీపీ  క్లిక్‌ చేయాలి. ఫోన్‌ నంబరుకు వచ్చిన ఓటీపీని నమోదు చేయగానే దరఖాస్తు తెరుచుకుంటుంది. ఆ తర్వాత... రిజిస్ట్రేషన్‌, పార్టిషన్‌, సక్సేషన్​లో అవసరమైన దరఖాస్తును ఎంపిక చేసుకొని పట్టాదారు పాస్‌బుక్‌ నంబరు నమోదు చేయాలి. ఏ సర్వే నంబరులో భూమిని అమ్ముతున్నారో ఎంపిక చేసుకొని ప్రొసీడ్‌ అని నొక్కాలి. తర్వాత విక్రయదారు, అమ్మకందారు, కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఛార్జీల చెల్లింపుతో స్లాట్‌ బుకింగ్‌ పూర్తవుతుంది. ఒకవేళ స్లాట్‌ బుక్‌ చేసుకున్న సమయానికి వెళ్లలేకపోతే ముందుగానే వాయిదా వేసుకోవాలి. రీ-షెడ్యూల్‌ అనే ఆప్షన్‌ ద్వారా మరో రోజుకు వాయిదా వేసుకోవచ్చు.

కావాల్సిన పత్రాలు..

రిజిస్ట్రేషన్‌ కోసం సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరి. అడ్వైజరీ కాలమ్‌లో  కొనుగోలుదారు, విక్రయదారు వెంట తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్లు ఉంటాయి. అమ్మకందారు పాస్‌బుక్‌, కొనుగోలుదారు పాస్‌బుక్‌, రిజిస్ట్రేషన్‌ చేయాల్సిన ఒరిజినల్‌ డాక్యుమెంట్‌, ఒరిజినల్‌ ఈ-స్టాంపులు, ఈ-చలాన్‌‌, ఇద్దరి పాన్‌కార్డులు... ఇవి లేకపోతే ఫామ్‌-61, ఇద్దరి ఆధార్‌కార్డులతో పాటు ఇద్దరు సాక్షుల ఆధార్‌కార్డులు అందుబాటులో ఉంచుకోవాలి.  

కొనుగోలుదారుకు పాస్‌బుక్‌ లేకపోయినా ఫర్వాలేదు. ఒకవేళ అంతకుముందే పాస్‌బుక్‌ ఉంటే అందులోనే ఇప్పుడు కొనుగోలు చేసిన ఆస్తి వివరాలు నమోదు చేస్తారు. లేనివారికైతే కొత్త పాస్‌బుక్‌ ఇస్తారు. స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనే రిజిస్ట్రేషన్‌/పార్టిషన్‌/సక్సెషన్‌కు ఈ-చలాన్‌ ద్వారా ఛార్జీలు చెల్లించాలి. ఆ వెసులుబాటు లేనివారైతే బ్యాంకుకు వెళ్లి డీడీ తీసి, ఆ నంబరును పోర్టల్‌లో నమోదుచేసి స్లాట్‌బుక్‌  చేసుకోవచ్చు. ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన పని లేదు.

ధర అదే చూపిస్తుంది..

భూ రిజిస్ట్రేషన్‌ మార్కెట్‌ విలువ, స్లాబ్‌లలో ఎలాంటి మార్పు చేయలేదు. గతంలో ఉన్న మార్కెట్‌ విలువనే ధరణి పోర్టల్‌లో స్థీరికరించారు. భూమి మొత్తం మార్కెట్‌ విలువలో 4శాతం స్టాంపు డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు, పట్టాదారు పాస్‌పుస్తకాలకు కొంత ఫీజు చెల్లించాల్సి  ఉంటుంది. ధరణి పోర్టల్‌లో 'వ్యూ మార్కెట్‌ వ్యాల్యూ ఆఫ్‌ ల్యాండ్స్‌ ఫర్‌ స్టాంప్‌ డ్యూటీ’' అనే ఆప్షన్‌ ఉంటుంది. అది ఎంపిక చేసుకొని జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ వివరాలు నమోదు చేస్తే... అక్కడి బేసిక్‌ మార్కెట్‌ విలువ ఎంత, మీరు ఎంపిక చేసుకున్న సర్వే నంబర్‌లోని భూమి మార్కెట్‌ విలువ ఎంత అనేది చూపిస్తుంది. దాని ప్రకారం రిజిస్ట్రేషన్‌ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది.

ఎక్కడి ధర అక్కడే

ప్రతి గ్రామానికి ఓ బేసిక్‌ మార్కెట్‌ విలువను ధరణిలో కేటాయించారు. ఓ గ్రామాన్ని తీసుకుంటే అక్కడ ఎకరం భూమికి మూల విలువ లక్షగా నిర్ధారిస్తే, ఆ గ్రామంలో ఎక్కడికి వెళ్లినా ఎకరం మార్కెట్‌ విలువ లక్షకుపైనే  ఉంటుంది. పట్టణాల్లో అయితే వార్డులు, బ్లాకుల వారీగా బేసిక్‌ మార్కెట్‌ విలువ కేటాయించారు. గ్రామం మొత్తానికి  ఒకే మూల విలువ ఉంటే, పట్టణాల్లో మాత్రం వార్డులు, బ్లాకుల వారీగా అది మారుతుంది.

ఇదీ చూడండి: 'ధరణి' లో కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు: కేసీఆర్​

Last Updated : Oct 29, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.