మేడ్చల్ పురపాలిక పరిధిలోని కిష్టాపూర్లో పార్కు ఏర్పాటు కోసం తమ స్థలాన్ని తీసుకున్నారని ఆరోపిస్తూ కొందరు దళితులు ఆందోళనకు దిగారు. కిష్టాపూర్ రహదారి పక్కన సర్వే నంబర్ 515లో ప్రభుత్వం తమకు 4.20 ఎకరాల భూమిని కేటాయించిందని వారు తెలిపారు. వంశ పారంపర్యంగా భూమిని సాగు చేసుకుంటున్నామన్నారు.
ఇప్పుడు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకుని పార్కు ఏర్పాటు చేయాలని చూస్తోందని ఆరోపించారు. పార్కు శంకుస్థాపనకు వస్తున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి తమగోడు చెప్పుకుందామంటే... ఆయన అక్కడ ఆగకుండా వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : గోపన్పల్లి భూ ఆరోపణలపై స్పందించిన ఎంపీ రేవంత్రెడ్డి