ETV Bharat / state

Land Of Love : ల్యాండ్ ఆఫ్ లవ్.. ఔత్సాహికులకు అద్భుత వేదిక

Land Of Love Art Exhibition: ల్యాండ్ ఆఫ్ లవ్.. యువత, ఔత్సాహిక మహిళా కళాకారులకు ప్రస్తుతం ఓ అద్భుత వేదికైంది. కళాకారులను ప్రోత్సహించి.. అంతరించిపోతున్న కళలకు జీవం పోసే ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భాగ్యనగరం శివారు ప్రాంతంలో కొలువైన ఈ వేదిక సరిహద్దులు చెరిపేస్తూ కళలు, సంగీతం, సాహిత్యం, ప్రకృతితో మమేకమయ్యేందుకు కృషి చేస్తోంది. సమకాలీన కళల్లో సామాజిక మార్పుల లక్ష్యంగా పల్లె వాతావరణం నడుమ "ఎథీనా" పేరిట ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ కన్నుల పండువగా సాగుతోంది. భిన్నమైన రంగాల్లో రాణిస్తున్న 9 మంది యువతుల చేతుల నుంచి జాలు వారిన వినూత్న కళ ఖండాలు సందర్శనకు ఉంచారు. మరి, ఆ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ విశేషాలు ఏంటో మనమూ తెలుసుకుందాం.

Land Of Love
Land Of Love
author img

By

Published : Apr 28, 2023, 2:43 PM IST

ల్యాండ్ ఆఫ్ లవ్ వేదికపై.. ఆకట్టుకుంటున్న వినూత్న కళ ఖండాలు

Land Of Love Art Exhibition: దేశంలో కళలకు ఆదరణ పెరుగుతోంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో అంతరిపోతున్న కళలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తూ.. వారిలో దాగి ఉన్న ప్రతిభను లోకానికి చాటిచెప్పే ప్రయత్నాలు సాగుతోన్నాయి. అందుకు ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌ అనే ఈ ప్రదేశం వేదికైంది. భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన కళాకారులతో వైవిధ్యభరితంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

విశేషంగా ఆకట్టుకుంటున్నాయి: మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం కేశవరంలో ఉన్న ల్యాండ్ ఆఫ్ లవ్ వేదికపై చిత్ర కళా ప్రదర్శన జరుగుతోంది. కళలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కేపీసీ ఎస్టేట్స్ లిమిటెడ్.. సోల్ స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ అప్డేటెడ్ స్టూడియోలో ఏర్పాటైంది. ఈ ప్రదర్శనలో ఔత్సాహిక యువ మహిళా కళాకారులు పాల్గొన్నారు. వారి అద్భుత కళారూపాలు అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఆ జిజ్ఞాసను వదులుకోలేక: ఎన్నో వర్ణాల్లో చక్కటి పెయింటింగ్స్ వేస్తూ ఆ రంగుల్లో తన జీవితం ప్రదర్శిస్తున్న ఈ యువతి పేరు స్వప్నిక కొవ్వాడ. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం నాయిరోలవలస. చిన్నప్పుడు విద్యాదాఘాతానికి గురైన ఆమె రెండు చేతులు కోల్పోయింది. కానీ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఫలితంగా డిగ్రీ పూర్తి చేసి.. డ్రాయింగ్‌లో రాణిస్తుంది. ఆర్థికంగా ఎవరి నుంచి మద్దతు లేకపోయినా.. గురువంటూ లేకపోయినా కూడా ఆ జిజ్ఞాసను వదులుకోలేక నోటితో పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టింది.

ఫలితంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత సోదరుడు నందకిషోర్‌.. తనను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రముఖుల ప్రశంసలు, అభినందనలు అందుకుంటుంది ఈ కళాకారిణి. 2డీ ఫార్మేట్‌లో ఎన్నో రకాల చిత్రాలు గీసి ప్రదర్శిస్తున్న ఈమె పేరు శిరీష నిప్పట్ల. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో సీనియర్ రిలియబిలిటీ ఇంజినీర్​గా సేవలందిస్తున్నారు.

ప్రయాణంలో చూసిన దృశ్యాలు: స్వతహాగా శిరీష ట్రావెలర్‌. ప్రయాణంలో చూసిన దృశ్యాలను మనసులో బంధించుకుని.. ఆ తర్వాత అవి కాన్వాస్‌పై అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని శాస్త్రీయ కళాకారిణిగా రాణిస్తోంది. ఈ ఎథీనా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లో కళాకారులు రూపొందించిన కళారూపాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. అయితే బ్లూ, వైట్‌, గ్రీన్‌ కలర్స్‌తో వేసిన చిత్రాలు చూసినప్పుడు అందరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నది తన లక్ష్యమని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నానని చెబుతుంది కళాకారిణి డాల్జీ.

ఇతర రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఈ వేదికపైకి తీసుకొచ్చి తమ ప్రతిభ పాటవాలు చాటించే ప్రయత్నం పట్ల మహిళా కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. రవీంద్రభారతి తరహాలో ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌ను ఏర్పాటయింది. సెలవుల్లో కుటుంబాలతో వచ్చి సంతోషంగా గడిపేందుకు అనువైన ప్రదేశంగా ఉంటుందంటున్నారు కేపీసీ ఎస్టేట్స్ లిమిటెడ్ డైరెక్టర్ అనిల్‌కుమార్. భాగ్యనగరం కాంక్రీట్ జంగిల్‌గా మారిన నేపథ్యంలో ప్రకృతికి, కళలకు నగరవాసులను దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటైందే ఈ ల్యాండ్‌ ఆఫ్‌ లవ్‌.

ఈ వేదికపై జరుగుతున్న చిత్ర కళా ప్రదర్శనను ఎథీనా ఆర్ట్ ఎగ్జిబిషన్‌గా నిర్వహకులు చెబుతున్నారు. పోస్టర్ షూట్స్, బోటిక్ చిత్రీకరణలకు అనుకూలంగా తీర్చిదిద్దిన ఈ స్టూడియో.. భారతీయసహా వివిధ దేశాల థీమ్స్‌, నిర్మాణశైలితో సిద్ధమై ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతోంది.

ఇవీ చదవండి: Aqua Tunnel : సమ్మర్ స్పెషల్.. అక్వా టన్నెల్.. ఫ్యామిలీతో కలిసి చూసొద్దామా..?

72రోజులు.. 2400 కిలోమీటర్లు.. కాలినడకన ఆటో డ్రైవర్​ లద్దాఖ్​ ట్రిప్​.. బైక్​ కొనేందుకు డబ్బులు లేక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.