ETV Bharat / state

సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు: హరీశ్​రావు - వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు తాజా వార్తలు

Minister HarishRao at CPR training program in Medchal: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా రెప్పపాటు కాలంలో కళ్లముందే ప్రాణాలు వదులుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మరీముఖ్యంగా కొవిడ్‌ తరువాత గుండె సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కార్డియాక్‌ అరెస్ట్ బాధితులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అకస్మత్తుగా గుండె ఆగిన సమయంలో బాధితుల ప్రాణాలు రక్షించేందుకు ఉపయోగపడే సీపీఆర్ శిక్షణను అందుబాటులోకి తెచ్చింది. మేడ్చల్​లోని సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డితో కలిసి హరీశ్​రావు పాల్గొన్నారు.

Minister HarishRao at the CPR training program

author img

By

Published : Mar 1, 2023, 4:24 PM IST

Updated : Mar 1, 2023, 4:53 PM IST

సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు: హరీశ్​రావు

Minister HarishRao at CPR training program in Medchal: అప్పటిదాకా ఆడుతూపాడుతూ ఉన్నవారు క్షణంలో కుప్పకూలుతున్నారు. రెప్పపాటులోనే ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏం జరిగిందో గుర్తించే లోపే ఊపిరి ఆగిపోతోంది. దీనికి కారణం సడన్‌ కార్డియక్‌ అరెస్ట్‌. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది గుండెపోటు వల్ల చనిపోతున్నట్లు అధికారిక నివేదికలు స్పష్టం చేశాయి. కొవిడ్‌ తర్వాత ఈ ఘటనలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్‌.. వైద్యారోగ్య శాఖ సహా పలు విభాగాలు, కమ్యూనిటీ వాలంటీర్లకు సీపీఆర్ ట్రైనింగ్‌ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. శారీరక శ్రమ లేకపోవడం వల్లే అనేక రోగాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇవాళ మేడ్చల్‌లోని మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు సంయుక్తంగా కలిసి సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారభించారు. ప్రస్తుత కాలంలో చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారని ప్రజల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతోనే సీపీఆర్ శిక్షణ తీసుకొచ్చామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

గుండెపోటు వల్ల రోజుకు సగటున 4 వేల మంది చనిపోతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీపీఆర్ శిక్షణ విజయవంతమైతే ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. సడెన్ కార్డియాక్ అరెస్టు చిన్న పెద్దా అని తేడా లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వస్తుందన్నారు. తెలంగాణలో ఏడాదికి సుమారు 25,000ల మంది చనిపోతున్నారని అంచనా. సీపీఆర్​తో 10 మందిలో ఐదుగురు బతికే అవకాశం ఉంటుందన్నారు.

ఇందులో భాగంగా ప్రతి జిల్లాకి 5 మాస్టర్‌ ట్రైనర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మాస్టర్‌ ట్రైనర్‌ వారానికి 300 మందికి ,సీపీఆర్ శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించారు. గోల్డెన్అవర్​లో ఈ చికిత్స చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అందుకే ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. దీనిలో అన్ని రంగాల వారిని, బస్తీ వాసులను, గేటెడ్ కమ్యూనిటీ వాసులను ఇందులో భాగస్వామ్యం చేస్తామని మంత్రి చెప్పారు.

రూ.18 కోట్లతో 1200 ఏఈడీలు కొనుగోలు: ప్రజల తమ విలువైన ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో ఈ సీపీఆర్ శిక్షణ తీస్తుకొచ్చామని వివరించారు. ఇందుకుగాను రూ.18 కోట్లతో 1200 ఏఈడీలు కొనుగోలు చేయాలని చూస్తున్నామని వెల్లడించారు. ఏఈడీని విధిగా ప్రతి ప్రాంతంలో పెట్టాలని లేఖ రాయాలని అనుకుంటున్నామని చెప్పారు. కానిస్టేబుల్ రాజశేఖర్, వరంగల్ కలెక్టరేట్​లో డీఎంహెఓ సీపీఆర్ ప్రక్రియ చేసి ప్రాణాలను కాపాడారని ఆయనని కొనియాడారు.

మాస్టర్ శిక్షకులకు శిక్షణ ఇచ్చి వారు కూడా శిక్షణ ఇచ్చేవిధంగా.. వారిని తయారు చేస్తామన్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార పదార్థాలను అందించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంత బిజీగా ఉన్నా కొంత వ్యాయామం చేయాలని సూచించారు. ఇందుకు 28,000 మంది వైద్య సిబ్బంది శిక్షణ ఇస్తారన్నారు. లక్షలాదిమంది ప్రాణాలు కాపాడే మంచి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమని మంత్రి వివరించారు.

'దీనికి చిన్న పెద్దా.. సమయం సందర్భం లేకుండా ఎప్పుడైనా, ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో చూస్తే ఒక సంవత్సరానికి 15 లక్షల మంది సడన్​గా కార్డియాక్ అరెస్టుతో చనిపోతూ ఉన్నారు. ప్రతి రోజు 4 వేల మంది ఈ సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్న పరిస్థితి. ఇలా చనిపోతున్న వారి సంఖ్యను మనం, సీపీఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈరోజు చూస్తే ఈ సడెన్ కార్డియాక్ అరెస్టైనా ప్రతి పది మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు. 9 మంది చనిపోతున్నారు. కానీ ఈ సీపీఆర్ ప్రక్రియను విజయవంతంగా చేయగలిగితే ప్రతి 10 మందిలో ఐదుగురిని దక్కించుకునే అవకాశం ఉందని ప్రపంచ సంస్థలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి'. -హరీశ్​రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2023, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.