ETV Bharat / state

మౌలాలిలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ హల్‌చల్‌ - మౌలాలిలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ హల్‌చల్

మౌలాలి ఆర్టీసీకాలనీలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి హల్‌చల్‌ చేశారు. ఓ స్థలం విషయమై ఆమె అక్కడికి వెళ్లి... రేకులతో నిర్మించిన ప్రహరీని తొలగించాలని అనుచరులకు సూచించారు. ఆమె కూడా కొన్నింటిని తొలగించారు.

corporator vijay reddy
corporator vijay reddy
author img

By

Published : Mar 30, 2021, 7:56 AM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా మౌలాలి ఆర్టీసీకాలనీ పరిధిలో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి హల్‌చల్‌ చేశారు. స్థానికంగా ఓ స్థలం విషయమై రెండు వర్గాల మధ్య గొడవ నడుస్తోంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి కార్పొరేటర్‌ అనుచరుడు కావటంలో ఆమె ఆ స్థలం వద్దకు వచ్చారు. అక్కడ రేకులతో ప్రహరీ నిర్మించి ఉండగా దాన్ని తొలగించాలని అనుచరులకు సూచించారు. ఆమె కూడా కొన్నింటిని తొలగించారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ చేస్తున్నామని మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాదరావు తెలిపారు. తమ కార్యకర్త కుటుంబం 1974లో ఈ స్థలం కొందని, ఇటీవల కొందరు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని చెబుతూ షెడ్డు వేసి దౌర్జన్యం చేస్తున్నారని కార్పొరేటర్‌ విజయారెడ్డి తెలిపారు. అందుకే తన కార్యకర్తకు సహాయంగా వెళ్లాల్సి వచ్చిందన్నారు.

ఇదీ చదవండి : ఈ సరస్సులో మునిగారో.. తేలేది శవంగానే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.