మేడ్చల్ జిల్లాలో తొలి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒక్క నిమిషం నిబంధన కారణంగా మల్కాజిగిరి, నేరెడ్మేట్, ఈసీఐల్లోని పరీక్ష కేంద్రాల వద్దకు గంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు.
గత అనుభవాల దృష్ట్యా ఇంటర్ బోర్డు పక్కా ఏర్పాట్లు చేసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, ఘట్కేసర్లోని కేంద్రాలకు విద్యార్థులు చేరుకున్నరు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.
ఇవీచూడండి: మొదటిరోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు