మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియా "కళావతి నగర్"లో డ్రోన్ కెమెరాతో పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చినా, వాహనాలపై తిరిగినా, గుంపులుగా కూర్చున్నా డ్రోన్ కెమెరా ద్వారా వెంటనే వారిని గుర్తించి పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని సీఐ బాలరాజు తెలిపారు.
బాలానగర్ జోన్లో మొదటి సారిగా డ్రోన్ కెమెరా ప్రయోగం జరిగిందని, ప్రజలు లాక్డౌన్కు సహకరించి కరోనాను తరిమి కొట్టాలని సూచించారు. డ్రోన్ కెమెరాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ 'కరోనా విందు'- ఒకరు అరెస్ట్