మేడ్చల్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మౌలాలి, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్- 19 పాజిటివ్ వచ్చినవారికి ఇంట్లోనే ఐసోలేషన్ లో చికిత్స అందిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
కొంతమందిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా... వైరస్ బయట పడుతోందని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. కరోనా కిట్లు ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు.