ETV Bharat / state

దిల్లీకి మనం పోవుడు కాదు దిల్లీ మన దగ్గరికొస్తది - కేసీఆర్​

"బడితె ఉన్నోనిదే బర్రె... మట్టి పనికైనా మనోడు ఉండాలె..." అంటూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కార్యకర్తలను హుషారెక్కిస్తున్నారు.​ వరుస రోడ్​షోలతో... ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్​, భాజపాలపై తనదైన చమత్కార విమర్శలు గుప్పిస్తున్నారు.

దిల్లీకి మనం పోవుడు కాదు దిల్లీ మన దగ్గరికొస్తది
author img

By

Published : Apr 4, 2019, 6:03 AM IST

దిల్లీకి మనం పోవుడు కాదు దిల్లీ మన దగ్గరికొస్తది
లోక్​సభ ఎన్నికల్లో 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే... తెలంగాణ ప్రయోజనాల కోసం దిల్లీలో ఉండే సర్కారే హైదరాబాద్​కి దిగి వస్తుందని కేటీఆర్​ చమత్కరించారు. మేడ్చల్​లో మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్​రెడ్డికి మద్దతుగా రోడ్​షో నిర్వహించారు. కొడంగల్​లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో చెల్లుతుందా అంటూ రేవంత్​రెడ్డిపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రోడ్​షో కార్యక్రమంలో తెరాస శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనటం వల్ల తోపులాట చోటుచేసుకుంది. జనాలను అదుపు చేయటానికి పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

ఇవీ చూడండి:నేడు ఖమ్మం, మహబూబాబాద్​ల​లో కేసీఆర్​ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.