మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని డీమార్ట్‌లో అన్నిరకాల వస్తువుల కొలతల్లో తేడాలు రావడం వల్ల వినియోగదారులు ఆందోళన చేపట్టారు. తూకాల్లో మోసం జరిగిందంటూ డీమార్ట్‌లోనే వినియోగదారులు ఆందోళనకు దిగారు. తప్పు జరిగింది క్షమించాలి అంటూ సిబ్బంది బతిమిలాడారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దంటూ అభ్యర్థించారు.
తూకాల్లో కిలోకు 300 గ్రాముల చొప్పున తక్కువ రావడం వల్ల జరిగిన మోసాన్ని నిలదీస్తూ డీమార్ట్‌లో శివ సాయినగర్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, ఇతర వినియోగదారులు ధర్నాకు దిగారు. డీమార్ట్‌లో ఆయా సరకుల తూకాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ బాధితుని ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు సంబంధిత వేయింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన వారిపై పోలీసులు, తూనికలు-కొలతల శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఈ నెల 22న కార్మికుల దేశవ్యాప్త సమ్మె