మేడ్చల్ జిల్లాలో సాయంత్రం భారీగా వర్షం కురిసింది. ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి మల్కాజిగిరి, నేరెడ్మెట్, చర్లపల్లి, దమ్మాయిగూడా, జవాహర్ నగర్, నాగారం ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చూడండి: హోం క్వారంటైన్‌కు జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి