లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మల్కాజిగిరి పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మోయిజ్ కూకట్పల్లి నియోజకవర్గంలో రోజుకు ఓ డివిజన్లో ఇంటింటికి తిరిగి పండ్లు పంపిణీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందరికి పౌష్టికాహారం అందడం లేదని గ్రహించి పండ్లను అందించేందుకు నడుం కట్టారు. అతను చేస్తున్న పనికి తోటి స్నేహితులు అతనికి తోడ్పాటు అందిస్తున్నారు. నిత్యం పండ్లను ఇంటింటికి తిరిగి అందిస్తున్నారు. తమ దాతృత్వం చాటుకుంటున్నారు.
ఇవీ చూడండి: వలస కష్టం: కాలి నడకన 2 వేల కి.మీ ప్రయాణం