Jhansi Medical College Fire Accident : ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి 11మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో రోజుల వయస్సున్న నవజాత శిశువులు ఉన్నారు. ఘటనా సమయంలో NICUలో మొత్తం 54 మంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు. ఆస్పత్రి NICU విభాగంలో రాత్రి 10.45 గంటలకు ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్ షాట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. పిల్లల వార్డు గదుల్లో ఆక్సీజన్ పూర్తిగా వ్యాపించి ఉండటం వల్ల మంటలు భారీగా విస్తరించాయని ఆస్పత్రి సూపరిండెంట్ సచిన్‌మహోర్ తెలిపారు. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అటు చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో కన్నవారి రోదనలు మిన్నంటాయి.
VIDEO | Visuals from inside the NICU (neonatal intensive care unit) of Jhansi Medical College where a fire broke out on Friday night. #Jhansifire
— Press Trust of India (@PTI_News) November 15, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/8sr2fg6m9M
VIDEO | Uttar Pradesh: Rescue operation continues at Jhansi Medical College where a fire broke out on Friday. #Fire #Jhansifire
— Press Trust of India (@PTI_News) November 15, 2024
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/TFras9L3jz
'12 గంటల్లో నివేదిక ఇవ్వండి'
సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకదళం చర్యలు చేపట్టింది. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని UP సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఝాన్సీ డివిజనల్ కమీషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.
'ఇప్పుడేం చెప్పలేం'
ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి ఝాన్సీకి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలిపారు. "శనజాత శిశువులు మరణం చాలా దురదృష్టకరం. ఈ ఘటనపై మొదటి దర్యాప్తు ఆరోగ్య శాఖ చేపడుతుంది. రెండో విచారణ పోలీసులు చేస్తారు. అగ్నిమాపక విభాగం కూడా అందులో భాగం అవుతుంది. అంతేకాకుండా మేజిస్ట్రేట్ స్థాయి విచారణ కూడా ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టం. కుటుంబ సభ్యులతో పాటు మేము చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పటివరకు ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించాం. మరో మూడు మృతదేహాలను గుర్తించలేదు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం. ఫిబ్రవరిలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరిగింది. జూన్‌లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. అయితే ఈ దుర్ఘటన ఎలా జరిగిందో అనే విషయం విచారణ నివేదిక వచ్చిన తర్వాతే చెప్పగలం." అని పాఠక్ తెలిపారు.
#WATCH | Jhansi Medical College Fire tragedy | UP Deputy CM Brajesh Pathak says, " in february, the fire safety audit was done. in june, a mock drill was also done. how this incident happened and why it happened, we can only say something about it once the probe report comes...7… pic.twitter.com/KTQe1Y5Sc3
— ANI (@ANI) November 16, 2024