మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ వార్డులో పేద పురోహితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. వార్డు అధ్యక్షుడు మురళీధర్ యాదవ్ తన మిత్రులైన కిరణ్, అభిషేక్‌ల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
దాదాపు 150 మంది పురోహితులకు వారానికి సరిపడా నిత్యావసరాలను, కూరగాయలను అందజేశారు. డివిజన్లో ఎవరైనా అవస్థలు పడుతున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే సాయం చేస్తామని వారు తెలిపారు.
ఇవీ చూడండి: క్షేత్రస్థాయిలో నిఘా: ఆ సడలింపులు ఇద్దామా? వద్దా?