కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఎగ్జామ్ రాసేందుకు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి... మాస్కులు, శానిటైజర్లను మాత్రమే లోనికి అనుమతించారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఈ పరీక్షను అధికారులు... అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇవాళ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్ష... ఉదయం తొమ్మిది నుంచే ప్రారంభం కాగా... మధ్యాహ్నం 12కు ముగుస్తుంది . అనంతరం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది. ఈ పరీక్ష కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 28వేల 15 మంది దరఖాస్తు చేసుకున్నారు.
కిలోమీటర్ దూరంలో..
నగరు శివారు ప్రాంతం బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో ఈసెట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన గేటు నుంచి పరీక్షా కేంద్రం కిలోమీటర్ దూరంలో ఉండటంతో... విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చూడండి: 'కరోనా వైరస్ మళ్లీ తిరగబెట్టవచ్చు... అప్రమత్తత అవసరం'