ETV Bharat / state

Uppal Bhagayath plots E-Auction 2021 : ఉప్పల్‌ భగాయత్‌ ప్లాట్ల విక్రయానికి మరోసారి ప్రీబిడ్‌ - ఉప్పల్ భగాయత్ ప్లాట్లు

Uppal Bhagayath Lands E-Auction 2021 : మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ భూముల వేలానికి హెచ్​ఎండీఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. డిసెంబరు 2, 3 తేదీల్లో 44 ప్లాట్ల విక్రయానికి నిర్వహించనున్న ఈ-వేలంలో ఎక్కువ మంది పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. నేడు బేగంపేట టూరిజం ప్లాజాలో హెచ్​ఎండీఏ ప్రీబిడ్‌ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన వారంతా ప్రీబిడ్‌కి రావొచ్చని తెలిపింది.

Uppal Bhagayath Lands E-Auction 2021, uppal bhagayath plots auction, ఉప్పల్ భగాయత్ భూముల వేలం, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం
Uppal Bhagayath Lands E-Auction 2021
author img

By

Published : Nov 27, 2021, 8:37 AM IST

Uppal Bhagayath Lands E-Auction 2021 : మేడ్చల్ జిల్లా ఉప్పల్‌ భగాయత్‌లో 44 ప్లాట్ల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నిర్వహించనున్న ఇ-వేలం నమోదుకు గడువు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. జనానికి పెద్దఎత్తున అవగాహన కల్పిస్తూ ఇందులో మధ్యతరగతి ఆశావహులను భాగం చేసేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వేలం ప్రక్రియలో పాల్గొనే వారు ముందస్తుగా చెల్లించే ధరావతు(ఈఎండీ) ఎంత ఎక్కువ చెల్లిస్తే అన్ని ఎక్కువ ప్లాట్ల బిడ్‌లో పాల్గొనే అవకాశముందని అధికారులు తెలిపారు.

E-Auction of 44 plots in Uppal Bhagayath : ప్రస్తుతం వేలంలో ఉంచిన ప్లాట్లలో 300 చదరపు గజాల వరకు ఉన్న ప్లాట్లు 10, 301-500 చ.గజాల వరకు ఒకటి, వెయ్యి చ.గజాల వరకు ఉన్నవి 2 ప్లాట్లే ఉన్నాయి. ఒక్క ప్లాటు మాత్రమే దక్కించుకోవాలనే ఆశతో దానికొక్కదానికే ధరావతు చెల్లిస్తే ఆ ఒక్క బిడ్‌లోనే పాల్గొనాల్సి ఉంటుంది. ముందస్తుగానే అంతకు మించి చెల్లించి ఇతర ప్లాట్ల బిడ్‌ల్లోనూ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ప్లాట్‌ దక్కకపోతే బిడ్‌ ముగిసిన తర్వాతిరోజే ధరావతు తిరిగి పొందొచ్చని స్పష్టం చేశారు.

కలిసి పాడొచ్చు :

44 plots in Uppal Bhagayath e-auction : ప్రస్తుతం ఇ-వేలంలో 1001-2000 చ.గజాల మధ్య ఉన్న 11 ప్లాట్లకు రూ.10 లక్షలు, 2001 చ.గజాల పైగా ఉన్న 20 ప్లాట్లకు రూ.15 లక్షల ధరావతు చెల్లించాల్సి ఉంది. వీటికి ఐదుగురి వరకూ సంయుక్తంగా వేలానికి నమోదు చేసుకోవచ్చని.. బిడ్‌ పూర్తయిన తర్వాత ఐదుగురి పేరు మీద సంయుక్తంగా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. క్రెడాయ్‌, భారీ భవన నిర్మాణ సంస్థలు, రియల్టర్లు, కన్సార్టియంలను ఆకట్టుకొనేందుకు హెచ్‌ఎండీఏ(E-Auction of 44 Uppal Bhagayath plots) ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే శనివారం (27వ తేదీ) బేగంపేట్‌ టూరిజం ప్లాజాలో మరోసారి ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

రిజిస్ట్రేషన్‌, ధరావతు చెల్లింపునకు తుది గడువు: నవంబరు 30, సాయంత్రం 5 గంటలు

వివరాలకు: https:/// auctions.hmda.gov.in

ఇ-వేలం వెబ్‌సైట్‌: https:///www.mstcecommerce.com

ఇ-వేలం జరిగేది: డిసెంబరు 2, 3 తేదీల్లో (ఉదయం 9 నుంచి 12 గంటల దాకా సెషన్‌-1), (మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల దాకా సెషన్‌-2), చదరపు

గజానికి కనీస ధర: రూ.35 వేలు.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.