మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆ ప్రాంత ప్రజలు కాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఎండాకాలం రాకముందే తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎండాకాలం వస్తే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.
దుండిగల్ ప్రాంతంలోని ఇంద్రానగర్, వివేకానంద నగర్ కాలనీల్లో ఉన్న బోర్లు ఎక్కువగా మరమ్మతుకు గురవుతున్నాయని ఛైర్మన్ కృష్ణవేణికి విన్నవించుకున్నారు. ఛైర్మన్ జోక్యం చేసుకుని నీటి సమస్యను అతి త్వరలో తీరుస్తామని... అంతవరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడం వల్ల బస్తీవాసులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: 'ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులను తీసుకోలేం'