రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజులుగా పడుతున్న వర్షాల నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను అధికారులు గుర్తించి కూల్చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పురపాలిక పరిధిలో 54 ఇళ్లను అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందించారు. మున్సిపల్ పరిధిలోని ఇప్పటివరకు 13 ఇళ్లను కూల్చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో ఎవరు ఉండకపోవడంతో కూల్చేశామన్నారు. బాధితులకు ఇతర చోట నివాసం కల్పించి కూల్చేస్తున్నామని వివరించారు. ప్రమాదవశాత్తు కూలిపోతే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నందునే తరలింపు ప్రక్రియ చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలి: ప్రభాకర్‌రావు