మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి కల్యాణ్ నగర్ సిఫెల్ కాలనీలోని మేఘనా ఆర్కేడ్లో నివాసం ఉండే డాక్టర్ భరత్ కుమార్, ఉమారాణిలు గాంధీ ఆసుపత్రిలో కొవిడ్-19 రోగులకు సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో వీరి సేవలకు కృతజ్ఞత తెలుపుతూ అపార్ట్మెంట్ వాసులు వారికి పూలమాల వేసి సన్మానం చేశారు. వారిపై పూలవర్షం కురిపించారు. యువకులు నృత్యాలు చేస్తూ వారిని ఉత్తేజపరిచారు. కరోనా కాలంలో వీరు అందిస్తున్న సేవలపై అపార్టుమెంట్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: దేశ వ్యాప్తంగా 27.11 శాతం పెరిగిన నిరుద్యోగ రేటు