నిజాంపేట్ పురపాలికలో పలు అభివృద్ధి పనులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మేయర్ నీలా గోపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ ప్రాంతాల్లో పూర్తైన సీసీ రోడ్లు, బహిరంగ వ్యాయామశాలను ప్రారంభించారు.
దాదాపు రూ.5 కోట్ల రూపాయలతో నిజాంపేట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధికి చిరునామాగా మార్చుతామని అన్నారు. పురపాలికలో జరిగే పనులపై ప్రతి శనివారం సమీక్ష నిర్వహించి, ముందుకు సాగుతామని వివేక్ వెల్లడించారు.