మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరుగా దూసుకుపోతోంది. పురపాలికలో అత్యధిక స్థానాల్లో గెలిచి గులాబీ జెండాను రెపరెపలాడించింది.
మొత్తం 18 వార్డులకు గానూ 15 స్థానాల్లో తెరాస గెలిచింది. మిగిలిన మూడు స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.