హైదరాబాద్ శివారులో కరోనా కలకలం సృష్టిస్తోంది. బోడుప్పల్‌లోని ఓ కాలనీలో వ్యాపారికి పాజిటివ్ తేలగా.. పట్టణంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కీసర మండలంలోని చీర్యాల గ్రామంలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందగా అతని భార్య, మనవడికి వైరస్ లక్షణాలు కనిపించగా వారిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాజాగా బోడుప్పల్లో మరో వ్యక్తిని వైద్యులు ఆసుపత్రికి తరలించారు.
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ఉల్లంఘిస్తున్న వారిని అదుపు చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. కొవిడ్ సోకిన వ్యక్తి నివాసమున్న కాలనీని మంత్రి మల్లారెడ్డి, మేయర్ సామ బుచ్చిరెడ్డి, పోలీసులు సందర్శించారు. అనంతరం రసాయన ద్రవ్యం పిచికారీ చేసి కాలనీలోకి రాకపోకలను నిలిపివేశారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ