హైదరాబాద్ దుండిగల్ పోలీస్స్టేషన్ పరధిలోని కైసర్నగర్ ప్రాంతంలో బాలానగర్ డీసీపీ పద్మజ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 90 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. శాంతి భద్రతలను పరిరక్షించాలనే ఉద్దేశంతో పలు కాలనీల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ తెలిపారు.
ఇదీ చూడండి : అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలి