మేడ్చల్ జిల్లా కొంపల్లి ఆస్పైసియాస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇవాళ, రేపు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు (congress training classes). మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ట్రైనింగ్ క్లాసులకు రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి దాదాపు 1,200 మంది పాల్గొంటారని వివరించారు. ఉదయం 10.45 గంలకు జెండా ఆవిష్కరణతో శిక్షణ కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించారు.
ఇదీ షెడ్యూలు
శిక్షణా కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి... పార్టీ పటిష్ఠత, సిద్ధాంతాలు అనే అంశాలపై మాట్లాడుతారు. డిజిటల్ మెంబర్షిప్పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, దీపక్ జాన్ ప్రసంగిస్తారు. ప్రజా చైతన్య పాదయాత్రపై ఏఐసీసీ కార్యక్రమాల ఇంఛార్జి మహేశ్వర్ రెడ్డి.... దళితులపై దాడుల గురించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, సామాజిక న్యాయంపైన మధు యాష్కీ, నైనాల గోవర్ధన్ తదితరులు మాట్లాడతారు.
రెండో రోజు షెడ్యూలు
నీటి పారుదల, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వ్యవసాయం, విద్యుత్, పోడు భూములు, మైనారిటీ సంక్షేమం, ప్రస్తుత రాజకీయ అంశాలు పైన ప్రసంగాలు ఉంటాయన్నారు. రెండో రోజున ఎమ్మెల్యే సీతక్క, ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ రామాంజనేయులు, కోదండరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, శ్రవణ్ దాసోజు, బలరాం నాయక్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, మన్నే సతీశ్ తదితరులు ప్రసంగిస్తారని వివరించారు.
ఇదీ చూడండి: Congress party Hyderabad news: కాంగ్రెస్ ఫ్లెక్సీలు చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఏం జరిగింది?