మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తాలో ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశానికి ఇందిరా గాంధీ అందించిన సేవలు ఎన్నటికీ మరువలేమని.. తరతరాలు ఆమెని స్ఫూర్తిగా తీసుకొని, అందరూ ఇందిరమ్మ బాటలో నడవాలని కాంగ్రెస్ నాయకుడు బండారి రాజిరెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది: ఉత్తమ్