అబ్దుల్లాపూర్‌మెట్ భూవివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జడ్పీ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్‌రెడ్డి తెలిపారు. సంబంధం లేని విషయాల్లో తన పేరు ప్రస్తావించడం సరికాదన్నారు. గౌరెల్లిలో 9 ఎకరాల స్థలం కొన్న విషయం వాస్తవమేనని తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. అందువల్లే తాను జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. సురేశ్ కుటుంబ సభ్యుల వివాదంలో తనను చేర్చుతూ కొందరు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఇవీచూడండి: తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి