ETV Bharat / state

దేవరయాంజాల్‌ భూములను పరిశీలించిన ఐఏఎస్‌ల కమిటీ

దేవరయాంజాల్​లోని భూముల ఆక్రమణ ఆరోపణలపై ఐఏఎస్​ల​ కమిటీ రంగంలోకి దిగింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్మించిన గోదాములను పరిశీలించింది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : May 4, 2021, 8:04 AM IST

Committee of IAS to inspect Devarayanjal, ias committee
ఐఏఎస్​ల కమిటీ విచారణ, దేవరయాంజాల్ భూ ఆరోపణలు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలంలోని దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి ఆలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన ఐఏఎస్‌ల కమిటీ సోమవారం రంగంలోకి దిగింది. పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఐఏఎస్‌ అధికారులు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, భారతీ హోళికేరి, శ్వేతా మహంతి క్షేత్రస్థాయిలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్మించిన గోదాములను పరిశీలించారు.

దేవస్థానానికి చెందిన 1521 ఎకరాల 13 గుంటల భూమి ఆక్రమణకు గురైందని ఆరోపణలున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయానికి సంబంధించిన భూముల్లో చేపట్టిన అక్రమ కట్టడాలు, నిర్మాణాలను పరిశీలించారు.

ఇదీ చదవండి: జాతీయ ప్రత్యామ్నాయ నేత దీదీయేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.