ETV Bharat / state

CM KCR Speech at Medchal Public Meeting : "హైదరాబాద్​లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తాం"

CM KCR Speech at Medchal Public Meeting : ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే.. అప్పటి కాంగ్రెస్​ నాయకులు అవహేళన చేశారని, రాజకీయ భిక్షగాళ్లలగా చూశారని సీఎం కేసీఆర్​ అన్నారు. ఎన్నికల వేళ మాయమాటలు చెబుతూ ఓట్ల కోసం వస్తారని.. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్​లో మరో లక్ష డబుల్ బెడ్​రూములు కట్టిస్తామని మేడ్చల్​లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రకటించారు.

KCR public meeting today
CM KCR Speech at Medchal Public Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 7:22 PM IST

Updated : Oct 18, 2023, 7:40 PM IST

CM KCR Speech at Medchal Public Meeting : సమైక్యపాలనలో అరిగోసలు పడ్డ తెలంగాణ.. నేడు స్వరాష్ట్ర పాలనలో దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారిందని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మేడ్చల్​లో(CM KCR Medchal Meeting) ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఆనాడు తెలంగాణలో కరెంట్ లేదు. మంచినీరు లేదని.. అడుగడుగునా వివక్ష గురయ్యామన్నారు.

CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : 'కాంగ్రెస్‌ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది'

KCR Medchal Meeting Today : సమైక్య పాలకుల కాలంలో 1956లో చిన్న పొరపాటు జరిగి.. అప్పటి తెలంగాణ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గితే 58 సంవత్సరాలు కష్టాలు పడ్డామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్​కుమార్​ రెడ్డి అహంకారపూరితంగా.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమని అంటే.. కాంగ్రెస్​ నాయకులు నోరెత్తలేదని కేసీఆర్​ గుర్తుచేశారు.

ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే.. అప్పటి కాంగ్రెస్​ నాయకులు అవహేళన చేశారన్నారు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగమన్నారు. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామి స్థానానికి చేరుకుందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సీఎం కేసీఆర్​ తెలిపారు.

Medchal Praja Ashirwada Sabha : ఈరోజు తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారిందని.. మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేడ్చల్​, కుత్భుల్లాపూర్​, ఎల్బీనగర్​, ఉప్పల్​ ఓ మిని భారతదేశమని.. ఇక్కడికి ఎంతో మంది పొట్టచేత పట్టుకుని వస్తారన్నారు. ఒక్క మేడ్చల్​ నియోజకవర్గానికే 26000 డబుల్​ బెడ్ రూం ఇళ్లు వచ్చాయని.. మల్లారెడ్డి తెలిపారన్నారు. వీటన్నింటిని ఒక్క రూపాయి తీసుకోకుండా పారదర్శకంగా పంపిణీ చేశామన్నారు. హైదరాబాద్​లో మరో లక్ష డబుల్​ బెడ్​ రూం ఇళ్లను నిర్మిస్తామన్నారు.

Telangana Assembly Elections 2023 : హైదరాబాద్​కు వచ్చే వారు ఎక్కువ శాతం ఇక్కడే స్థిరపడుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్​ హమీ ఇచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం అందిస్తామన్నారు. పింఛన్లను దశల వారీగా పెంచుతామన్నారు. మల్లారెడ్డి లాంటి అనుభవం ఉన్నవాళ్లు, మంచి వాళ్లు ఉంటే మేడ్చల్ అభివృద్ధి చెందుతుంది.

మల్లారెడ్డి వంటి సమర్ధవంతమైన నేత మేడ్చల్​ నియోజకవర్గానికి కీలకమని.. ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వాదించాలని కేసీఆర్​ ప్రజలను కోరారు. నేడు ఎన్నికల వేళ మాయమాటలు చెబుతూ వస్తారని.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం వచ్చిందని.. ఆపద మొక్కులు మొక్కే వారిని నమ్మొద్దని కేసీఆర్​ కోరారు.

"సమైక్యపాలనలో అరిగోసలు పడ్డ తెలంగాణ.. నేడు స్వరాష్ట్ర పాలనలో దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారింది. ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే.. అప్పటి కాంగ్రెస్​ నాయకులు అవహేళన చేశారు. ఈరోజు తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారింది. మేడ్చల్​, కుత్బుల్లాపూర్​, ఎల్బీనగర్​, ఉప్పల్​ ఓ మినీ భారతదేశం. హైదరాబాద్​కు వచ్చే వారు ఎక్కువ శాతం ఇక్కడే స్థిరపడుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాము". - కేసీఆర్​, సీఎం

CM KCR Speech at Medchal Public Meeting "హైదరాబాద్​లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తాం"

CM KCR Speech at Siddipet Praja Ashirwada Sabha : 'ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలి'

CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

Last Updated : Oct 18, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.