రాష్ట్రంలో వీఆర్వోలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పురపాలక శాఖ తెరాస అధ్యక్షుడు బండారు శ్రీనివాస్‌గౌడ్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెరాస ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
రెవెన్యూ చట్టం విప్లవాత్మకమైందని, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. వీఆర్వోల రద్దు నిర్ణయంతో ఎవరి మీద కక్ష సాధించట్లేదని సుధీర్‌రెడ్డి అన్నారు. ప్రజల కోణంలో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పావని తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్