ETV Bharat / state

ఏ మాత్రం మోసపోయినా గోసపడతాం, అప్రమత్తంగా ఉండాలన్న సీఎం కేసీఆర్​ - ఏ మాత్రం మోసపోయినా గోసపడతాం

CM KCR Medchal Tour దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దాదాపు 12 రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో బతుకుతున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ బహిరంగసభలో మాట్లాడారు.

CM KCR Medchal Tour
CM KCR Medchal Tour
author img

By

Published : Aug 17, 2022, 4:41 PM IST

Updated : Aug 18, 2022, 12:09 PM IST

CM KCR Medchal Tour: నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వారు ఎప్పటికీ ఉంటారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని అంతాయిపల్లి వద్ద 30 ఎకరాల్లో 50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్​ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

మనం జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలమని ముఖ్యమంత్రి కేసీఆర్​ సూచించారు. అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఏమాత్రం మోసపోయినా గోస పడతామని ప్రజలను సీఎం హెచ్చరించారు. మేడ్చల్‌లో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్‌ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రజలకు పరిపాలన ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు.

మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే విద్యుత్‌, సంక్షేమం వచ్చేదా? దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరగాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తాం. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లీ ఏకం కావడం కష్టం. అభివృద్ధి చెందిన దేశాల బాటలో కుల, మత రహితంగా ముందుకు సాగాలి. నీచ రాజకీయల కోసం ఎంతకైనా తెగించే ఎప్పటికీ ఉంటారు. అందుచేత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలం. - కేసీఆర్, సీఎం

రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరుతున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పింఛన్లు అందిస్తున్నామని.. మొత్తం 46 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా నీటికొరత తీర్చుకున్నామని తెలిపారు. ఇది మామూలు విషయం కాదని.. ఇవాళ దిల్లీలో 24 గంటలు విద్యుత్‌ లేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దేశంలో అసమర్థ విధానాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని కేంద్రాన్ని విమర్శించారు.

ఇవాళ రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,78,500 గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇవాళ వృద్ధుల వద్ద డబ్బులు ఉంటున్నాయని.. ఆర్థికంగా మనం అభివృద్ధి సాధించాని పేర్కొన్నారు. ఇవాళ మన జీఎస్‌డీపీ రూ.11 లక్షల 55 వేలకోట్లుగా ఉందన్నారు. భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం కేసీఆర్

ఇవీ చదవండి: ఈ నెల 22న వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

భాజపా అనూహ్య నిర్ణయం, పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీ ఔట్

Last Updated : Aug 18, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.