మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చక్రిపురంలో బుధవారం రాత్రి ఇరువర్గాల యువకుల మధ్య ఘర్షణ(Street Fight) చోటుచేసుకుంది. కొంతమంది యువకులు తమ ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ... కారణం లేకుండా ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని స్వాతి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమ కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేసి కొట్టారని ఆ యువతి పోలీసులకు తెలిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌కు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Suicide: 15 రోజులుగా చెట్టుకు వేలాడిన ప్రేమజంట