మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో.. గృహ నిర్మాణ సహకార సంఘంలో సభ్యత్వం ఇస్తామంటూ.. నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన సంఘం ప్రతినిధులపై సీఐడీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శ్రీ రామ లింగేశ్వర బలహీన వర్గాల గృహ నిర్మాణ సహకార సంఘం.. బాధితుల నుంచి రూ. 5వేలను వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. బాధితులు తమ వద్ద ఉన్న ధృవపత్రాలతో డీజీపీ కార్యాలయంలోని ముడో అంతస్తులో ఫిర్యాదు చేయాలని కోరారు. సంఘంపై.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: బీమా పాలసీలు చేయించి హత్యలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు