మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని గాజులరామరాంలో చిత్తారమ్మ దేవి జాతర నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచించారు. ఆలయ పరిసరాల్లో దుకాణాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతివ్వలేదు.
జాతర కోసం అన్నిశాఖల సమన్వయంతో ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: శ్రీవారి సన్నిధిలో గవర్నర్ తమిళిసై!