మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ నగర పురపాలక పరిధిలో దారుణం జరిగింది. వీధికుక్కల దాడిలో గాయపడ్డ ఓ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సుశీల టౌన్షిప్లో అంగోత్ బేబీ(6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలికను తల్లిదండ్రులు ఉప్పల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బాలికను నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బేబీ మరణించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం సాాయం చేయాలని.. మున్సిపాలిటీ పరిధిల్లో వీధికుక్కలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'