గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. రామంతాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన గొల్ల కురుమ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని నిత్యానంద పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి భాజపా తోడ్పడుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించాలి: సీతక్క