అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్ను ఢీ కొట్టి.. అవతలి రోడ్డుపై ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.