భారత్... ప్రపంచానికే వ్యాక్సిన్ అందించడం గర్వపడే అంశమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వ్యాక్సిన్‌ను ప్రజలకు తొందరగా అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్‌లో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించిన బండి సంజయ్... టీకా తీసుకున్న వారితో ముచ్చటించారు.
రెండో డోసు తీసుకోవడానికి వచ్చిన వారితో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. లాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా అక్కడే ఉన్న లాబ్ టెక్నీషియన్లను సంజయ్ అభినందించారు. ఉప్పల్ అర్బన్ పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌లుగా పనిచేస్తున్న శ్రీనివాస్, భగత్‌లను కరోనా సీజన్‌లో దాదాపు 25వేల మందికి కొవిడ్ టెస్టులు చేసినందుకు వారిని అభినందించారు. కష్టకాలంలో వైద్య సిబ్బంది చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్