తెలంగాణలో పేదింటి ఆడబిడ్డ సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్ ఛైర్మన్లు కొండల్‌రెడ్డి, పావనీ పాల్గొన్నారు.
దసర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ వేడుకలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి