బస్తీల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి రంగారెడ్డి నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ఉన్న బస్తీ దవాఖానాలతో పాటు మరికొన్నింటిని ఏర్పాటు చేసి.. వాటిలో మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెరాస ప్రభుత్వం పని చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ బస్తీ దవాఖానాలు నిరుపేదలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం రంగారెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
![Basti dispensary opened in Rangareddy Nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-17-11-basti-dhawakhana-opening-av-ts10011_11092020113751_1109f_1599804471_380.jpg)