రాష్ట్రంలో కరోనా తన వ్యాప్తిని కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు, సిబ్బందికి కరోనా సోకి మరణించగా.. తాజాగా కొవిడ్ మహమ్మారితో బాచుపల్లి ఎస్ఐ యూసుఫ్ మృతి చెందారు.
ఈరోజు ఉదయం 9 గంటలకు కేపీహెచ్బీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన మరణించారు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. అధికారులు సైతం కరోనా కారణంగా మృతి చెందడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి : తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్ కేసులు నమోదు