ETV Bharat / state

రెండోరోజూ కొనసాగుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ - acp Narsimha reddy's investigation is going on second day

అక్రమాస్థుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. బంజారాహిల్స్​లోని అనిశా కార్యాలయంలో ఈ విచారణ జరుగుతోంది.

acp Narsimha reddy's investigation is going on second day
రెండోరోజూ కొనసాగుతున్న ఏసీపీ నర్సింహారెడ్డి విచారణ
author img

By

Published : Oct 6, 2020, 1:12 PM IST

మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజూ విచారిస్తున్నారు. బినామీల పేరిట ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై లోతుగా ప్రశ్నిస్తున్నారు.

బంజారాహిల్స్​లోని అనిశా కార్యాలయంలో నర్సింహారెడ్డిని విచారిస్తున్న అధికారులు.. ఆయనకు సంబంధించిన మరో బ్యాంకు లాకర్​ను నేడు తెరవనున్నారు.

బినామీ పేర్లతో మాదాపూర్​లో 1960 గజాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన కేసులో అనిశా అధికారులు ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. నర్సింహారెడ్డి, తన బినామీల పేర్ల మీద ఉన్న ఈ 1960 గజాల స్థలం మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అనిశా అధికారులు లెక్క గట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు గతంలోనే అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. వంద కోట్లకు పైగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.

ఇంట్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలిస్తే మాదాపూర్ ప్రభుత్వ వ్యవహారం బయట పడింది. నర్సింహారెడ్డిని ఈనెల 5న కస్టడీలోకి తీసుకున్న అనిశా అధికారులు.. సోమవారం ఆయనను విచారించారు. నర్సింహారెడ్డికి సంబంధించి హైదరాబాద్​లో 4 నివాస గృహాలు, ఏపీలోని అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి బినామీ ఆస్తులుగా గుర్తించారు. మరిన్ని వివరాల కోసం నేడూ విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: గ్రీన్ ఛాలెంజ్: మొక్కలు నాటిన నటి, లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.